శంషాబాద్ రూరల్, మార్చి 22 ః ఔటర్‌రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలైన ఘటన ఆదివారం జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ నుంచి హైదరాబాద్(గౌచ్చిబౌలి)కి ఏపీ 36 ఏఆర్ 5511 నంబర్‌గల కారులో బయలుదేరి వస్తుండగా శంషాబాద్ సమీపంలోని తొడుపల్లి వద్దకు రాగానే కారు డ్రైవర్ రాజేష్ ముందుగా వెళ్తున్న టీఎస్08యూఎఫ్ 8229 నంబర్‌గల లారీని ఓవర్‌టెక్ చేయబోయి ఢికొట్టడంతో కారు దెబ్బతినడంతో పాటు కారులో ఉన్న వారందరికి గాయాలైయ్యాయి.
బలమైన గాయాలైన కపిలవాయి లక్ష్మీనారాయణరావు(54) అక్కడిక్కడే మృతి చెందారు.ఆయనతో పాటు మృతుడి భార్య హరికుమారి,మరదలు శ్రీదేవి, కూతురు సంయుక్తతో పాటు డ్రైవర్ రాజేష్‌కు స్వల్ప గాయాలైయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.