Mahmood Ali | తెలంగాణలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధి : హోంమంత్రి మహమూద్ అలీ
Mahmood Ali | తెలంగాణలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధి చెందారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సనత్ నగర్‌లోని బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
Mahmood Ali | తెలంగాణలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధి చెందారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సనత్ నగర్‌లోని బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నోచుకోని ముస్లిం మైనారిటీలు నోచుకోలేదన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు అండగా నిలువాలన్నారు. సనత్‌నగర్‌లో 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసి చూపించారన్నారు.
ఆయనను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన రేవంత్‌రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌లో పదవుల కోసం సొంత పార్టీ నేతల్లోనే కుమ్ములాడుకుంటున్నారన్నారు. ప్రజల బాధలు పట్టని కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల్లో ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లావుద్దీన్ కోటిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో నాయకులు ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకనే అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని.. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ వెంటే అన్నివర్గాల ప్రజలు ఉన్నారన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

