హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో నగరంలోని కోర్టులకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి (సైబరాబాద్ పరిధిలో) జిల్లాల్లో అన్ని కోర్టులకు కూడా సెలవు ప్రకటించింది. సికింద్రాబాద్లోని జ్యుడిషియల్ అకాడమీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలకు కూడా 9వ తేదీన సెలవు. ఇందుకు ప్రతిగా నవంబర్ 19వ తేదీ శనివారం పనిచేస్తాయని రిజిస్ట్రార్ జనరల్ తెలియజేశారు.