Holi | నాగోల్ బండ్లగూడ పరిధిలోని సహభావన టౌన్షిప్ బీ బ్లాక్‌లో హోలీ సంబురాలు ఫుల్ జోష్‌తో జరిగాయి. బీ బ్లాక్‌లోని మహిళలు, పిల్లలు హోలీ విషెస్ చెప్పుకుంటూ.. సంబురాల్లో మునిగి తేలారు. పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఆనందోత్సాహాలతో రంగుల పండుగ చేసుకున్నారు. బీ బ్లాక్‌కు చెందిన మహిళలు, పురుషులు, చిన్నారులు ఒకరికొకరు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. డీజే పాటలు పెట్టుకుని నృత్యాలు చేశారు.