Hit and Run Case | గంజాయి మత్తులో హిట్ అండ్ రన్ కేసు నిందితుడు సందీప్.. వీడియో
Hit and Run Case | హిట్ అండ్ రన్ కేసు నిందితుడు సందీప్ రాయదుర్గం పీఎస్‌లో సందీప్ ఓ చైర్లో కూర్చున్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పుడు సందీప్ గంజాయి మత్తులో మునిగి తేలుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
Hit and Run Case | హిట్ అండ్ రన్ కేసులో టీటీడీ బోర్డ్ మెంబర్, పాపులర్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. సందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రాయదుర్గం పీఎస్‌కు తరలించారు. రాయదుర్గం పీఎస్‌లో సందీప్ ఓ చైర్లో కూర్చున్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పుడు సందీప్ గంజాయి మత్తులో మునిగి తేలుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సందీప్ గంజాయి సేవిస్తూ మత్తును ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదంలో బీహార్‌కు చెందిన నందులాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ మెయిన్ రోడ్డు మార్గంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సందీప్ అతివేగంగా నడుపుతూ వచ్చిన కారు రోడ్డు దాటుతున్న నందులాల్‌ను తీవ్రంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న నందులాల్‌ను కాపాడేందుకు జైద్ షా ఖాద్రీ అనే విద్యార్థి స్పందించి, తన కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ మార్గంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సందీప్ కారును మరో మహీంద్రా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ అనూహ్య పరిణామాల మధ్య గాయపడిన నందులాల్ మృతి చెందాడు. ప్రమాదానికి పాల్పడిన తర్వాత వెనుక నుంచి ఢీకొట్టిన మహీంద్రా కారు ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక నిపుణుల సాయంతో ప్రమాదానికి కారణమైన సందీప్ కారుతోపాటు, దానిని ఢీకొట్టి వెళ్లిపోయిన మహీంద్రా కారును గుర్తించారు.
గంజాయి మత్తులో TTD బోర్డు మెంబర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్
ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణం బలిగొన్న సందీప్
హిట్ అండ్ రన్ కేసులో ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు అదుపులో సందీప్ https://t.co/dd16qGwkJk pic.twitter.com/96pzCyxtXB
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026
Read Also :
Jailer 2 | జైలర్ 2’ రిలీజ్‌పై క్లారిటీ.. ఆ డేట్‌కి ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ మాస్ జాతర!
ప్రజా వ్యతిరేక పాలనపై భగ్గుమన్న బీఆర్ఎస్ మిర్యాలగూడ శ్రేణులు
ఢిల్లీ వాళ్ల కాళ్ల ముందు తెలంగాణ ఆత్మ గౌరవం : మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

