KTR | బంజారాహిల్స్, ఫిబ్రవరి 13 : భగవద్గీత ప్రచారంలో భాగంగా శ్రీశ్రీశ్రీ అచార్య ప్రభోధానంద రచించిన గ్రంథాలను ప్రబోధ సేవాసమితి, హిందూ జ్ఙానవేదిక సభ్యులు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో అందజేశారు. భగవద్గీతలోని జ్ఞానాన్ని అందరికీ చేరవేయాలనే లక్ష్యంతో సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో మూడు గ్రంథాలను రూపించామని సేవా సమితి కమిటీ సభ్యులు మంతటి వెంకటయ్య తెలిపారు.