Legal Exhibition | హైదరాబాద్ : ‘లా’ అంటే కేవలం థియరీనే కాదు.. ప్రాక్టికల్‌గా కూడా న్యాయ విద్యను ప్రజలకు వివరించొచ్చు అనే విషయాన్ని కేశవ మెమోరియల్ లా కాలేజీ విద్యార్థులు నిరూపించారని హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి దేవి అభిప్రాయపడ్డారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లా కాలేజీ ప్రాంగణంలో జస్టిస్ మాధవి దేవి లీగల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. లా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రిన్సిపాల్ డాక్టర్ వాణితో కలిసి జస్టిస్ మాధవి దేవి సందర్శించారు.
ఈ సందర్భంగా జస్టిస్ మాధవి దేవి మాట్లాడుతూ.. ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, విద్యార్థుల స్టాల్స్‌ను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉంది. రాజ్యాంగం మనకు భగవద్గీత లాంటిది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కేశవ మెమోరియల్ లా కాలేజీ యాజమాన్యం నిర్వహించిన లీగల్ ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉంది. రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను చక్కగా వివరించారు. స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఏర్పాటు చేసిన స్టాల్స్ చాలా బాగున్నాయి. న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకునే వారు తప్పకుండా ఈ లీగల్ ఎగ్జిబిషన్‌ను సందర్శించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ‘లా’ విద్యార్థులతో పాటు ఇతరులు కూడా ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తే బాగుంటుంది. ఇలాంటి ఎగ్జిబిషన్స్‌ను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియల్ వ్యవస్థ ఎలా ఉంది..? న్యాయం ఎలా పొందొచ్చు..? అనే విషయాలను బాగా వివరించారు. ప్రత్యేకంగా క్రిమినల్ కేసుల్లో న్యాయం ఎలా పొందొచ్చనే విషయాన్ని బాగా చెప్పారు. ‘లా’ అంటే కేవలం థియరీనే కాదు.. ప్రాక్టికల్‌గా చూడడం వల్ల చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎగ్జిబిషన్లు నిర్వహించడం వల్ల విద్యార్థులకు, ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఒక నమ్మకం కలుగుతుంది. ఇలాంటి లీగల్ ఎగ్జిబిషన్స్‌ను అన్ని కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లీగల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలనే ఆలోచనతో విద్యార్థులను ప్రోత్సహించి, వారికి వెన్నుదన్నుగా నిలిచిన లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వాణితో పాటు ఫ్యాకల్టీకి, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు అని జస్టిస్ మాధవి దేవి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Sangareddy | పుట్టిన రోజు నాడే.. ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని మృతి
Delhi Pollution: ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. ఆన్లైన్లోనే ప్రైమరీ స్కూల్ క్లాసులు