KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో పోలీసులు ఐదంచెల భద్రత అమలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు దాదాపు 500 మీటర్ల వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే కిలోమీటర్ మేర పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల ఆంక్షలతో జూబ్లీహిల్స్ పీఎస్ ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు సిట్ విచారణ నేపథ్యంంలో తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అలాగే పలువుర్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. విద్యార్థి విభాగం నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ నేతలను అర్ధరాత్రి నుంచే అక్రమ అరెస్టులు చేశారు. బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, జంగయ్య, ప్రశాంత్, నాగేందర్, మిథున్ ప్రసాద్, వెంకటేష్ గౌడ్ సహా పలువురు నేతలను అరెస్టు చేశారు.
తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు
భవన్ చుట్టుపక్కల భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు https://t.co/diDqsEpQFJ pic.twitter.com/svDeejnxrB
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2026