Hyderabad Rains : హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొట్టింది. సోమవారం వాన బీభత్సనానికి రహదారులన్నీ జలమయం కాగా.. మంగళవారం కూడా కొన్ని చోట్ల అదే పరిస్థితి కనిపించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బోరబండా, ఎర్రగడ్డ, మాదాపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, కొండాపూర్, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో వాన కుమ్మరించింది.
లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద నీళ్లు భారీగా చేరడంతో గచ్చిబౌలి – లింగంపల్లి మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. యూసుఫ్‌గూడలోని శ్రీకృష్ణ నగర్లో రహదారలు జలమయం అయ్యాయి. దాంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైటెక్ సిటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.