సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గురువారం గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. గరిష్ఠం 31.2, కనిష్ఠం 23.8, గాలిలో తేమ 68 శాతంగా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వివరించారు.