Heavy Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాన దంచికొడుతుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఉక్కపోతకు గురైన నగర ప్రజలకు ఈ భారీ వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. అయితే ప్రయాణికులకు, వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి.
అబిడ్స్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, సోమాజిగూడ, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక, రాంనగర్, అల్వాల్, హబ్సిగూడ, నాచారం, ఉప్పల్, దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, చార్మినార్, అఫ్జల్గంజ్తో పాటు తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతుంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.