Hyderabad Rains | హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడు ప్రతాపం చూపించగా.. సాయంత్రం వరకు మొత్తం చల్లబడింది. పలుచోట్ల మేఘాలు కమ్మేసి వర్షం కురుస్తున్నది. మల్కాజ్గిరి, నేరేడ్మెట్, ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, మేడిపల్లి, బోడుప్పల్, ఫీర్జాదిగూడ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. ఆసిఫాబాద్, మందమర్రి, ధర్మపురి, కమలాపూర్, కరీంనగర్, చెన్నూరు, పెద్దపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్, షాద్‌నగర్, మోత్కూరు, భువనగిరిలోనూ వాన పడుతోంది.కాగా, నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు కర్ణాటక మీదుగా.. ఇవాళ రాయలసీమలోకి విస్తరించాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.