సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో 2 రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాల నేపథ్యంలో నగరానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు. సోమవారం గ్రేటర్లో అత్యధికంగా శేరిలింగంపల్లిలోని మియాపూర్లో 5.1సెం.మీల వర్షపాతం నమోదు కాగా, మలక్పేట, అంబర్పేట, అడ్డగుట్ట ప్రాంతాల్లో 3.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.