హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వర్షం వేళ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షం ఆగగానే వెంటనే రోడ్లపైకి రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. తమ ప్రయాణాలు ఒక గంటటసేపు వాయిదా వేసుకోవాలని చెప్పారు. వర్షం తగ్గిన గంట తర్వాత వాహనదారులు బయటకు రావాలని తెలిపారు. నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో ఇలా వర్షం కురవడంతో వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు.