ICC : మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు దెబ్బకు చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మ్యాచ్ ఫీజులో కోత విధించింది. టీమిండియాతో మ్యాచ్‌లో ఐసీసీ నియమావళిని సనా ఉల్లంఘిచండమే అందుకు కారణం. సెప్టెంబర్ 5 శనివారం భారత జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma)ను ఔట్ చేసిన ఆమె.. ఆవేశంగా పెవిలియన్ అదుగో అంటూ చేతితో సంజ్ఞ చేసింది. దాంతో.. ఐసీసీ సనాకు శిక్ష వేసింది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో 55కే ఆలౌటైన పాకిస్థాన్‌కు ఐసీసీ షాకిచ్చింది. భారత జట్టుతో మ్యాచ్‌లో హద్దు మీరి ప్రవర్తించిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు జరిమానా విధించింది. సెప్టెంబర్ 5 శనివారం టీమిండియాతో మ్యాచ్‌లో ఐసీసీ నియమ నిబంధనలను ఆమె ఉల్లంఘించింది. ఇన్నింగ్స్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన ఓపెనర్ షఫాలీ వర్మను రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసిన అనంతరం.. ఫాతిమా నోరు పారేసుకుంది. షఫాలీ వైపు కోపంగా చూస్తూ.. అదిగో పెవిలియన్ అటు అనే అర్ధం వచ్చేలా చేతితో సంజ్ఞ చేసింది. భారత ఓపెనర్‌ను రెచ్చగొట్టేలా ఆమె ప్రవర్తించిన తీరును మ్యాచ్ రిఫరీ సుప్రియా రాణి దాస్ తీవ్రంగా పరిగణించింది.
Fatima Sana turning up the heat despite the scoreline. 🥵
Watch India vs Pakistan LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #DPWorldWomensAsiaCup2026 #NotAGentlemansGame pic.twitter.com/j2ohXqlZSV
— Sony Sports Network (@SonySportsNetwk) September 5, 2026
పాక్ కెప్టెన్ ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్టు గుర్తించిన రిఫరీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మ్యాచ్ అనంతరం ఫాతిమాను విచారణకు పిలవగా.. ఆమె తన నేరాన్ని అంగీకరించింది. దాంతో, మ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది రిఫరీ. గత 24 నెలల్లో తను ఐసీసీ కోడ్‌ను అతిక్రమించడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్‌పై ఐసీసీ కోడ్ పాటించనందుకు ఫాతిమాకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది ఐసీసీ. ఈసారి టీమిండియాపై దురుసుగా ప్రవర్తించినందుకు పాక్ సారథికి ఫైన్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది రిఫరీ. దాయాదుల మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత శ్రీ చరణి(3-7), ప్రేమా రావత్(3-9)లు తిప్పేయగా పాక్ 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 8.4 ఓవర్లలోనే చేధించింది.