Hyderabad | హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సైదాబాద్, సంతోష్ నగర్, కాంచన్‌బాగ్, ఉప్పుగూడ, గౌలిపురా, ఛత్రినాక, లాల్‌దర్వాజ, షాలిబండ, బేగంపేట, ప్యారడైజ్, చిలకలగూడ, అడ్డగుట్ట, సీతాఫల్మండి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీగా వాన పడుతోంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాల్టి నుంచే స్కూల్స్ మొదలుకావడంతో విద్యార్థులు కూడా ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతున్నారు. కాగా, నైరుతి రుతుపవనాల విస్తరణతో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.