HYD Rains | హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. దాదాపు గంటన్నరకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలీపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్టలో భారీ వర్షం పడింది. ఖైరతాబాద్, ఎస్నగర్నగర్, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, ముషీరాబాద్, సనత్‌నగర్, యూసఫ్‌గూడ, శ్రీకృష్ణనగర్‌లో భారీ వర్షం పడగా.. పంజాగుట్ట, శ్రీకృష్ణనగర్‌లో రహదారిపైకి వరద పోటెత్తింది. బాలానగర్, కుత్బుల్లాపూర్, బండ్లగూడజాగీర్, జగద్గిరిగుట్ట, చింతల్, జీడిమెట్ల, గాజులరామారం, రాయదుర్గం, మాదాపూర్, కూకట్పల్లి, మూసాపేట, జేఎన్టీయూ, నిజాంపేట, కేపీహెచ్‌బీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడ్డది.
కార్వాన్, టోలీచౌకి, లంగర్‌హౌస్, జియాగూడ, మెహదీపట్నం, బాగ్‌లింగంపల్లి, కవాడిగూడ, చిక్కడపల్లి, విద్యానగర్, రాంనగర్, అడిక్‌మెట్, భోలక్‌పూర్, అంబర్‌పేట, కాచిగూడ, బర్కత్‌పురా, కర్మన్‌ఘాట్, చంపాపేట, సైదాబాద్, సంతోష్‌నగర్‌లో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు జలమయమయ్యాయి. అమీర్‌పేట, శ్రీకృష్ణనగర్‌లో రోడ్లు చెరువులను తలపించాయి. రహదారిపై భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. వర్షం, వరద నేపథ్యంలో వాహనాలు రోడ్లపై నెమ్మదిగా కదులుతున్నాయి. రాజ్‌భవన్ రహదారిలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిలిచింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమీర్‌పేటలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీటిలో వాహనదారులు తీవ్ర అవస్థలుపడ్డారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేటలో వర్షం నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కర్వాన్‌లో కురిసిన భారీ కురవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎస్ఆర్నగర్, మైత్రివనం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు.. సోమాజిగూడ కూడలి వద్ద వాహనాలరాకపోకలు స్తంభించాయి.