HYD Rain | హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురుస్తున్నది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. మారేడుపల్లి, చిలుకలగూడ, సీతాఫల్మండి, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్, కవాడీగూడ, దోమలగూడ, భోలక్‌పూర్, అంబర్‌పేట, కాచిగూడ, బర్కత్‌పుర, సైదాబాద్, చంపాపేట్, సరూర్‌నగర్, కర్మఘాట్, సంతోష్‌నగర్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాన పడుతున్నది.
వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా.. ఇవాళ హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాబోయే గంట వ్యవధిలో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా ప్రభావం అర్ధరాత్రి నుంచి ఉంటుందని.. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.