Hyderabad | హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకు చెందిన జాహ్నవి ఇండిగో విమానయాన సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తుంది. రాజేంద్రనగర్ పరిధిలో నివాసం ఉంటుంది. అయితే సోమవారం రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.