AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్‌కు మరో రూ.10 కోట్లను కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్‌ను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ వేదికగా నవంబర్ 14, 15వ తేదీల్లో దీన్ని నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ నిర్వహణకు ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే దుబాయ్ పర్యటనకు వెళ్లొచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అక్కడ ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. విశాఖలో జరగనున్న సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్‌కు రావాలని ఆహ్వానించారు.