Suryakumar Yadav : ఆసియా కప్ ఛాంపియన్‌గా మొదటి టీ20 సిరీస్‌కు సన్నద్దమవుతోంది టీమిండియా. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఐదు మ్యాచ్‌ల పొట్టి సీరీస్‌ను పట్టేసేందుకు వ్యూహరచన చేస్తోంది. ఆసీస్‌పై కూడా ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్నే అమలు చేయనుంది. బుధవారం తొలి టీ20 జరుగునున్నందున కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మీడియాతో మాట్లాడుతూ కాంబినేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఆస్ట్రేలియా అంటేనే పేస్, బౌన్సీ పిచ్‌లకు పెట్టింది పేరు. అందుకే.. కంగారూ టీమ్‌ను ఓడించాలంటే పేస్ బలం ఎంతో ముఖ్యం. అయితే.. భారత్ మాత్రం ఈ ఫంథాను అనుసరించబోదు అంటున్నాడు సారథి సూర్య. బుధవారం తొలి మ్యాచ్ ఉన్నందున జట్టు కూర్పు ఎలా ఉండనుంది? అనే ప్రశ్నకు బదులిస్తూ.. పరిస్థితులను బట్టి కాంబినేషన్లు మార్చడం మా నైజం కాదని తేల్చిపారేశాడు మిస్టర్ 360.
The India captain calls their problem of plenty ‘a good headache’ to have pic.twitter.com/dZJlPaBNMc
— ESPNcricinfo (@ESPNcricinfo) October 28, 2025
‘పరిస్థితులకు తగ్గట్టు అని చెప్పి భారత జట్టు కూర్పులో భారీగా మార్పులు చేయం. ఎందుకంటే బౌన్సీ పిచ్‌లున్న దక్షిణాఫ్రికా పర్యటనలోనూ ఒకే ఫాస్ట్ బౌలర్, ఒక ఆల్‌రౌండర్.. ముగ్గురు స్పిన్నర్లుతో బరిలోకి దిగాం. ఆసియాలో అయినా.. ఆసియా అవతల అయినా సరే మేము మ్యాచ్‌ల కోసం కాకుండా వరల్డ్ కప్ లక్ష్యంగా సాగుతున్నాం అని సూర్య వెల్లడించాడు. అంతేకాదు గెలుపే లక్ష్యంగా ఆడుతున్నప్పుడు కాంబినేషన్ల గురించి పట్టించుకోం. ఒక మ్యాచ్‌లో ఆడినవాళ్లు మరొక మ్యాచ్ దూరం కావచ్చు. కొన్నిసార్లు అదనపు స్పిన్నర్, అదనపు పేసర్, ఆల్‌రౌండర్.. ఇలా చిన్నపాటి మార్పులు చేయాల్సి వస్తుంది. అలాఅనీ తమను పక్కన పెట్టేశారని స్క్వాడ్‌లోని ఏ ఒక్కరూ బాధపడరు. ఇప్పుడు భారత ఆటగాళ్లు ఆ మానసిక పరిపక్వతకు వచ్చేశారు’ అని సూర్య తెలిపాడు.
When you know the #AUSvIND T20I series is starting tomorrow 🥳#TeamIndia | @GautamGambhir | @surya_14kumar pic.twitter.com/1jY1oLFvI0
— BCCI (@BCCI) October 28, 2025
భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరుగనుంది. దాంతో.. తుది జట్టులో ఉండేది ఎవరు? అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆసియా కప్‌లో దంచేసిన ఓపెనర్ అభిషేక్ శర్మకు తోడుగా శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఉండే అవకాశముంది. ఇక వన్డే సిరీస్‌లో ఆడని బుమ్రా రాకతో బౌలింగ్ దళం పటిష్టం కానుంది. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తిప్పేసేందుకు రెఢీగా ఉన్నారు. ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్ రెడ్డి లేదా ఆసియా కప్‌లో మెరిసిన శివం దూబేలో ఒకరికి అవకాశం దక్కనుంది.
టీమిండియా టీ20 స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్, హర్షిత్ రానా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.