Curd And Raisins | పెరుగును మనం రోజూ తింటూనే ఉంటాం. చాలా మందికి భోజనం చివర్లో పెరుగును తినకపోతే భోజనం చేసిన ఫీలింగ్ కలగదు. అందులో భాగంగానే పెరుగును ఇష్టంగా తింటుంటారు. ఇక కిస్మిస్లను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వీటిని నేరుగా తింటారు లేదా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. అయితే పెరుగులో కిస్మిస్లను కలిపి కాసేపు నానబెట్టి ఆ తరువాత తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగు కిస్మిస్ మిశ్రమం అద్భుతమైన కాంబినేషన్‌గా పనిచేస్తుందని వారు అంటున్నారు. ఈ మిశ్రమంలో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని తరచూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
పెరుగులో కిస్మిస్లను నానబెట్టి తినడం వల్ల అనేక విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. విటమిన్లు ఎ, ఇ, సి, ఫోలేట్, విటమిన్ బి2, బి12, ఫైరిడాక్సిన్, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలను ఈ మిశ్రమం ద్వారా పొందవచ్చు. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా రక్షిస్తాయి. ఈ మిశ్రమంలో అధికంగా ఉండే ఐరన్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం, ఫైబర్ మనల్ని రక్షిస్తాయి. మన శరీరానికి శక్తిని, పోషణను అందిస్తాయి. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఈ మిశ్రమం పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను సైతం పెంచుతుంది. దీంతో వారి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది.
పెరుగు కిస్మిస్ల మిశ్రమాన్ని రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఈ మిశ్రమం ఎముకలను, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుంచి బయట పడవచ్చు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
పెరుగు కిస్మిస్ల మిశ్రమాన్ని తినడం వల్ల కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోవడం తగ్గుతుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. చురుగ్గా పనిచేస్తారు. ఉత్తేజంగా ఉంటారు. ఈ మిశ్రమం యాంటీ ఏజింగ్ గుణాలను సైతం కలిగి ఉంటుంది. చర్మాన్ని రక్షిస్తుంది. దీని వల్ల చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా పెరుగు కిస్మిస్ల మిశ్రమం మనకు ఎంతో మేలు చేస్తుంది.