Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఖైరతాబాద్, కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, సైఫాబాద్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాసాబ్ ట్యాంక్, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు, ప్రజలు మెట్రో ఫ్లై ఓవర్లు, ఇతర ఫ్లై ఓవర్ల కింద ఉండిపోయారు. దీంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.