హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆకాశమంతా మేఘావృతమైంది. మీర్పేట, బడంగ్పేట్, బాలాపూర్, గుర్రంగూడ, ఎల్బీనగర్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి, బీహెచ్ఈఎల్ ఏరియాల్లోను చిరుజల్లులు కురిశాయి. ఉస్మానియా యూనివర్సిటీ, రాంనగర్, ఉప్పల్, నాచారం పరిధిలోనూ వర్షం కురిసింది. దీంతో ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. చల్లని గాలులు వీస్తుండటంతో.. ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు.
Heavy downpour with gust winds occuring in gurramguda lb nagar stretch #HyderabadRains @Hyderabadrains
— Mythili Dheeraj (@GDK_Analyst) May 31, 2022
Badangpet!! pic.twitter.com/TE8MQM8E8I
— Sridhar (@siddu_143) May 31, 2022