Hyderabad Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై భారీగా వాన నీరు నిలిచిపోయింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదిలా ఉండగా.. నగరంలోని మారేడ్‌పల్లిలో భారీ వాన కురిసింది. 7.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ వెల్లడించింది.
యూసుఫ్‌గూడలో 7.4 సెంటీమీటర్లు, ముషిరాబాద్లో 7, షైక్పేటలో 6.9, శేరిలింగంపల్లిలో 6.8, ఖైరతాబాద్ 6.7, మారేడ్‌పల్లి 6.6, ఉప్పల్ 6.6, బేగంపేట 6 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. మల్కాజ్గిరి 5.8, కూకట్పల్లి 5.6, రహమత్‌నగర్ 5.6 వర్షాపాతం రికార్డయ్యింది. చందానగర్, కాప్రా, గాజులరామారం, కూకట్పల్లి, గోషామహల్, ఎల్బీనగర్, కార్వాన్, అల్వాల్, అంబర్‌పేట, మలక్‌పేట, సరూర్‌నగర్, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, చాంద్రయాణగుట్ట, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని అధికారులు వివరించారు.