Hyderabad Rains | గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో వాన దంచికొడుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, శేరిలింగంపల్లి, మణికొండ, కూకట్పల్లి, బాలానగర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, బండ్లగూడ, హిమాయత్ సాగర్, లంగర్ హౌస్, గండిపేటలో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, అల్వాల్, హకీంపేట, సీతాఫల్మండి, ఉప్పల్, రామ్నగర్, చిలకలగూడ, తార్నాక, హబ్సీగూడ తదితర ప్రాంతాల్లో వాన కురుస్తోంది.
కుండపోత వాన కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో మూడు గంటల పాటు వర్ష ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.