సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మొంథా తుఫాను ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఎడతెగని వానతో నగరం అస్తవ్యస్తంగా మారింది. రాత్రి 9 వరకు అత్యధికంగా 4.40సెం.మీలు, కంటోన్మెంట్లో 4.08 సెం.మీలు, బౌద్ధనగర్‌లో 4.0సెం.మీలు, మారెడుపల్లిలో 3.90సెం.మీలు, పడిపోయిన ఉష్ణోగ్రతలు.. తుఫాను ప్రభావంతో నగరంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే కిందకు పడిపోయాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.8డిగ్రీలు, గాలిలో తేమ 95శాతంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
