సిటీబ్యూరో, జూలై 20, (నమస్తే తెలంగాణ):ఎగువన కురుస్తున్న వానల కారణంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు వరద ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తమై వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు.
ఆదివారం రాత్రి 8 గంటల వరకు ఉస్మాన్‌సాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1782.80, హిమాయత్‌సాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50, ప్రస్తుత నీటిమట్టం :1759.15 అడుగులు ఉన్నాయి.