హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో(Shamshabad Airport) మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్ నుంచి వస్తున్న ప్రయాణికులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ సిబ్బంది ఎయిర్పోర్ట్ డీఆర్ఐ అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని సోదాలు చేపట్టారు. సోదాల్లో వారి వద్ద సుమారు 7 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకున్న డీఆర్ఐ అధికారులు
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న డీఆర్ఐ అధికారులు. pic.twitter.com/O7izWC9rzF
— Telugu Scribe (@TeluguScribe) November 1, 2024