బంజారాహిల్స్,ఏప్రిల్ 27: నిత్యం రణగొణ ధ్వనుల నడుమ విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల్లో ఏర్పడే వినికిడి సమస్యలను గుర్తించేందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పీఎస్‌లో బుధవారం ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్‌లైన్స్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి.
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే.ముత్తు ప్రారంభించారు. ప్రముఖ ఆడియాలజిస్ట్ డా.రాజేంద్రకుమార్ నేతృత్వంలో వైద్యుల బృందం ట్రాఫిక్ పోలీసుల వినికిడి శక్తిని పరిశీలించారు. అనంతరం వారికి అవసరమైన సూచనలు జారీ చేశారు. పీఎస్‌లో పనిచేస్తున్న వారందరికీ ఈ పరీక్షలు చేయించినట్లు ఇన్స్పెక్టర్ ముత్తు తెలిపారు.