Bandlaguda | బండ్లగూడ, జులై 4 : పారిశుద్ధ కార్మికులు వైద్యుల సూచనలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర పేర్కొన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులతో పాటు ఇతర సిబ్బంది కూడా పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. పారిశుద్ధ కార్మికుల సేవలు మరువలేవని తెలిపారు. తెల్లవారుజామునే వారు రోడ్లపైకి వచ్చి అనేక రకాల సేవలు అందిస్తారన్నారు. అందుకే వారు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్య పరిరక్షణకు వైద్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ డి.చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్, హెల్త్ ఆఫీసర్ శివకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, వైద్య శాఖ అధికారులు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.