సైదాబాద్ : సైదాబాద్ బాలుర-1 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో బుధవారం ముక్తి భారత్ అభియాన్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేసి, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యపరమైన సమస్యలను తెలుసుకోవడానికి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు.
పాఠశాలలోని విద్యార్థులందరికీ వైద్య శిబిరాన్ని నిర్వహించి, అవసరమైన విద్యార్థులకు వైద్యులు తగు సూచనలు చేశారని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కహక్షన్, వి రాజేశ్, కె విజయ్, పర్సీన్, వార్డెన్ హకీం, గౌసుద్దీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.