మన్సురాబాద్, జూన్ 29 : హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 – 2003 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఆటోనగర్‌లోని అనన్య రిసార్ట్స్‌లో ఘనంగా జరుపుకున్నారు. పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరు నాటి జ్ఞాపకాలను సభా వేదికగా పంచుకున్నారు. తమ చిన్ననాటి చిలిపి చేష్టలను, మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యాబుద్ధులు నేర్పి తమ జీవితాలలో వెలుగులు నింపిన గురువులను ఎప్పటికీ మరువలేమన్నారు. గురువులు నేర్పిన విద్యాబుద్ధుల వలనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గురువులు జనార్దన్ రెడ్డి, పాపిరెడ్డి, యాదయ్య, వెంకటప్ప రెడ్డి, సంజీవరెడ్డి, సత్తిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకటేష్, కరిమల, సునీత, భాగ్యవతిలను విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు వందకు పై చిలుకు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.