రూ.50 లక్షల హవాలా నగదు స్వాధీనం
ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.50 లక్షల హవాలా నగదును రాయదుర్గం పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాయదుర్గం మీదుగా భారీ ఎత్తున నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ, రాయదుర్గం పోలీసులు కలిసి ఖాజాగూడ రహదారిపై నిఘా పెట్టారు.
శేరిలింగంపల్లి, మార్చి 7: ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.50 లక్షల హవాలా నగదును రాయదుర్గం పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాయదుర్గం మీదుగా భారీ ఎత్తున నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ, రాయదుర్గం పోలీసులు కలిసి ఖాజాగూడ రహదారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఖాజాగూడ రహదారిపై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇన్నోవా క్రిస్టా వాహనంలో విక్రమ్ నగేశ్ అనే వ్యక్తిని గుర్తించిన పోలీసులు..
అనుమానంతో అతడి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న రెండు బ్యాగుల్లో రూ.50 లక్షల నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాను హెచ్పీ గ్యాస్ డీలర్నని, సికింద్రాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్నట్లు విచారణలో విక్రమ్ నగేశ్ తెలిపాడు. నగదుకు సంబంధించిన ఆధారాలు, బిల్లులు లేకపోవడంతో.. పోలీసులు విక్రమ్ నగేశ్ను అదుపులోకి తీసుకొని, వాహనం, నగదును సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదును ఐటీ శాఖకు అప్పగిస్తామని, ఐటీ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

