మేడ్చల్, మే 31(నమస్తే తెలంగాణ)/దుండిగల్: పట్టణ, పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చూడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంగళవారం ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలలోని పట్టణ, పల్లె ప్రగతిలో ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులంతా ప్రజలను భాగస్వామ్యులను చేసేలా చూడాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 63 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.