హైదరాబాద్, జన వరి 28 (నమస్తే తె లంగాణ) : మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండా లని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆకాంక్షిం చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసులు కాదు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం చెల్లదన్న హైకోర్టు
హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): పోలీసులకు ఉండే అధికారాలు అటవీ శాఖ అధికారులకు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ పరిధిలోకి వచ్చే నేరాలపై దర్యా ప్తు జరిపే అధికారం పోలీసులకు మా త్రమే ఉంటుందని తేల్చింది. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు మాత్ర మే అటవీ అధికారులకు వీలుంటుందని పేర్కొన్నది. నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో అక్రమంగా ప్రవేశించి అధికారిపై దాడిచేసినట్టు ఆరోపిస్తూ నమో దు చేసిన ప్రాథమిక నేర నివేదికను కొట్టేయాలంటూ మేడ్చల్ మలాజిగిరి జిల్లా అల్వాల్‌కు చెందిన సాయిరోహిత్ సహా ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జే శ్రీనివాసరావు ఇటీవల విచారణ జరిపారు. ఐపీసీ కింద వారు కేసులు నమోదు చేయ డం చెల్లదని తెలిపారు.
హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): సిబిల్ సోరు రిపోర్టులో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడమేంటని హైకోర్టు ప్రశ్నించిం ది. దీనిపై సమగ్ర వివరాలతో కౌంట ర్ దాఖలు చేయాలని రిజర్వు బ్యాంక్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. గతంలో పలుసార్లు ఆదేశించినప్పటికీ కౌంటర్లు దాఖలు చేయలేదని, మార్చి 17లోగా దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.