Harish Rao | గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తిపోయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకి వస్తుందని.. మిమ్మల్ని ఉరి తీసినా తప్పు లేదని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడన్నారు. ఈ రోజు కూడా సమ్మక్క సాగర్ బ్యారేజీలో 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు కలిపి ఒక్కరోజులో 2,542 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చన్నారు.
సాధారణంగా దేవాదుల మోటర్లు 71 మీటర్ల నీళ్లు ఉంటే పనిచేస్తాయి, కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయి. అంటే నీళ్లు ఉండి కూడా కావాలని ఎత్తిపోయడంలేదని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టులో సగానికి పైగా మోటార్లు అసలు ఆన్ చేయలేదు.మీ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80% చెరువులు ఎండిపోయి ఉన్నాయన్నారు.
గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తిపోయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది
మిమ్మల్ని ఉరి తీసినా తప్పు లేదు
చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడు
ఈరోజు కూడా సమ్మక్క సాగర్ బ్యారేజీలో 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది
దేవాదుల… https://t.co/IZUYXTl77Y pic.twitter.com/ofU7w89ggj
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026