నగరంలో ఈదురుగాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు నేలకూలగా.. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మంగళవారం వీచిన భారీ ఈదురుగాలి, వర్షం కారణంగా కర్మన్ఘాట్ దుర్గానగర్కాలనీ రోడ్ నంబర్8లో 4 చెట్లు, 5 విద్యుత్ స్తంభాలు కూలి అక్కడున్న కార్లపై పడటంతో అవి ధ్వంసమయ్యాయి.
చెట్లు కూలిన సమయంలో కార్లలో ఎవరూలేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
-చంపాపేట, జూలై 7