సిటీబ్యూరో : గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.ఆది, సోమవారం జరిగే గ్రూప్-2 పరీక్షలకు 48,011 అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. 101 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
పరీక్షలు సాఫీగా జరిగేలా ఐదుగురు రీజినల్ కో ఆర్డినేటర్స్, 15 మంది జాయింట్ రూట్ ఆఫీసర్, టీజీపీఎస్సీ ద్వారా 101 మంది అబ్జర్వర్లు, 3 పరీక్ష కేంద్రాలకు ఒకరు చొప్పున 33 మంది ైఫ్ల్లయింగ్ స్వార్డ్స్ 101 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 458 మంది ఐడెంటిఫికేషన్ అధికారులు, ప్రతి పరీక్ష కేంద్రానికి 3 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అభ్యర్థులను ఉదయం సెషన్లో 8:30 గంటలకు మధ్యాహ్నం నుంచి 1:30 నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. సైబరాబాద్, రాచకొండ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ను విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్మహంతి, రాచకొండ సీపీ సుధీర్బాబులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200మీటర్ల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్మిగూడటం, సభలు, సమావేశాలు నిర్వహించడం, ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిషేధమన్నారు.