శామీర్‌పేట: పంచాయతీ కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత మల్లేశ్‌యాదవ్ అన్నారు. అలియాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న కార్మికుల సమ్మె బుధవారం నాటికి14వ రోజుకు చేరింది. కార్మికులు రోడ్డుపై బైఠాయించి..నిరసన తెలిపారు.
కీసర: మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ దమ్మాయిగూడ మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ధర్నాకు దిగారు. సుమారు 200 మంది కార్మికులు సీఐటీయూ, ఐఏఫ్టీటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. కార్యాలయానికి వెళ్తున్న కమిషనర్ నాగమణిని అడ్డుకొని జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.