MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
MLC Dasoju Shravan Kumar | మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుకు తగిన గుణపాఠం చెప్పాలంటే గ్రాడ్యుయేట్స్ తప్పనిసరిగా నడుం బిగించి ముందుకు రావాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు.
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి నియోజకవర్గంలో, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉమ్మడి నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్తకర్తలు, శాసనసభ్యులు గ్రాడ్యుయేట్స్ ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో నిమగ్నమయ్యారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ రెండు ఉమ్మడి నియోజకవర్గాల్లో దాదాపు 10 లక్షలపైచిలుకు ఓటర్లుంటే ఇంకా నత్తనడకన సాగుతూ 5-6లక్షలు కూడా ఓటర్ ఎన్రోల్మెంట్ అయినట్టు లేదు.. అంటే ఎక్కడో ఒక అచేతన, నిర్లిప్తత, మనకెందుకులే అనే భావన గ్రాడ్యుయేట్స్‌లో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దాని కోసం కేటీఆర్ పెద్ద ఎత్తున టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ బీఆర్ ఎస్ శాసనసభ్యులను, నాయకులను అందరినీ కూడా తట్టి లేపుతూ నిరంతరం ఫాలో అప్ చేస్తున్నారు.. ఇప్పడు కొంత వేగంగా ముందుకు పోతుందన్నారు.
2026 నవంబర్ 6..అంటే మొత్తం 7 రోజులు మాత్రమే మనకు మిగిలి ఉంది. ఈ 7 రోజుల్లో రికార్డు బద్దలు కొట్టే విధంగా బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పని చేసి గ్రాడ్యుయేట్స్ ఓటర్ ఎన్రోల్మెంట్ చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ కోరారు.. అటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మిగితా రాష్ట్రాల్లో కానీ ఎట్లాఅయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఆయా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు ఏరకంగానైతే ఆ రాష్ట్ర ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారో.. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో అధికారంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాతలు పెట్టారు. ప్రజా వ్యతిరేక విధానాల కావొచ్చు.. విద్యార్థి వ్యతిరేక విధానాలు కావొచ్చు. మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరుకు తగిన గుణపాఠం చెప్పాలంటే గ్రాడ్యుయేట్స్ తప్పనిసరిగా నడుం బిగించి ముందుకు రావాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.
LIVE: తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ @sravandasoju మీడియా సమావేశం https://t.co/pz8tM5EpIS
— BRS Party (@BRSparty) October 30, 2026
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
Watch: ఐఎన్ఎస్ విక్రాంత్‌పై.. రాఫెల్ మెరైన్ తొలి ల్యాండింగ్ అండ్ టేకాఫ్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

