ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
రూ.40లక్షలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
గోల్నాక, మే 24: నియోజవకవర్గ వ్యాప్తంగా కాలనీలతో పాటు బస్తీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం అంబర్‌పేట డివిజన్ ఓల్డ్ పటేల్‌నగర్ బిలాల్ మజీదు బస్తీలో సుమారు రూ.40లక్షలతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్లతో పాటు సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోని బిలాల్ మసీదు బస్తీ రూపురేఖలు మార్చి ఎలాంటి సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. దీంతో పాటు పక్కనే గల నరేంద్రనగర్ బస్తీలో కూడా త్వరలోనే రూ.40లక్షలతో కొత్తగా సీసీ రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ల పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం బస్తీలో పలు శాఖల అధికారులతో కలసి బిలాల్ మజీద్ లైన్, నరేంద్రనగర్‌లో పాదయాత్ర చేశారు. ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ప్రజలను పలకరిస్తూ సమస్యల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, లింగారావు, సతీశ్‌తో పాటు బస్తీ నాయకులు మహ్మద్ అజీజ్, సలీం, మహ్మద్ షఫీ పాల్గొన్నారు.
కష్టపడి చదివి… కొలువు కొట్టండి
కాచిగూడ,మే 24: ఒకేసారి 80 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ప్రకటన ఇవ్వడం సంతోషకరమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న ఆలోచనతో సీఎం నూతన జోనల్ వ్యవస్థను రూపొందించారన్నారు. నిరుద్యోగ యువత కష్టపడి చదివి ప్రభుత్వ కొలువులను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనారిటీ శాఖల పరిధిలోని స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ తరగతులను నిర్వహిస్తుందన్నారు.అదే విధంగా నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించేందుకు అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో అనుభవం గల ఉపాధ్యాయుల చేత కోచింగ్ ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు యువతీ, యువకుల నుంచి 285 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. యువత కష్టపడి చదివి, కొలువు కొట్టాలని సూచించారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అదే విధంగా ఐఏఎస్ 1653 పోస్టులు, ఐపీఎస్ 1432 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.