Speed Limit on Hyderabad Roads | సిటీబ్యూరో, మే 25 (నమస్తేతెలంగాణ) : గ్రేటర్ రహదారులపై రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల వేగ పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన రహదారులపై కారు 60.. బస్సులు, ఆటోలు, బైక్లు 50 వేగంతో ప్రయాణించాలని నిర్దేశించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. కాలనీ రహదారులపై 30 కి.మీ.వేగంతో వెళ్లాలని సూచించింది. గతంతో పోల్చితే గ్రేటర్ వ్యాప్తంగా ప్రధానరో డ్లతోపాటు అంతర్గత రహదారులు మెరుగుపడ్డాయి.
అవసరమున్నచోట్ల బీటీ, వీడీసీసీ, సీసీ రోడ్ల ను నిర్మించడంతో జీహెచ్ ఎంసీ, పోలీసు, రవాణా శాఖ అధికా రులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం వేగ పరిమితులను మూడు కేటగిరీలుగా విభజించింది. వాహన వేగానికి సరిపడేలా రోడ్లు డిజైన్ చేయడంతో వేగం పెరిగినా సురక్షితంగా వాహనదారుడు గమ్యం చేరేందుకు వేగపరిమితిని నిర్ధారించినట్లు అధికారులు వెల్లడించారు.