కందుకూరు, మే 31: ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు మండల పరిషత్ అభ్యర్థి అధికారి బానోతు సరిత సూచించారు. మండల పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన పసులకడి ధనుంజయ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తూ అకాల మరణం చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రమాద బీమా పథకం కింద అతని కుటుంబానికి రూ ఒక లక్ష ఆర్థిక సహాయం మంజూరు చేసింది. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆ పరిహారాన్ని ధనుంజయ్ సతీమణి జ్యోతికి బానోతు సరిత అందజేశారు.
ఈ సందర్భంగా బానోతు సరిత మాట్లాడుతూ.. ధనంజయ్ సేవలు వెలకట్టలేనివని అన్నారు .పేద ప్రజల సంక్షేమానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను వినియోగించుకోవాలని కోరారు. కాలం ఎంతో విలువైనదని చెప్పారు.