మల్కాజిగిరి, మే 31 : గూడ్స్ రైలు(Goods train) బోగిలు పట్టాలు తప్పిన(Derailed) సంఘటన మల్కాజిగిరి(Malkajigiri) సర్కిల్ ఉప్పరిగూడలో జరిగింది. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు కాజీపేట నుంచి సనత్‌నగర్‌కు బొగ్గులోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు ఉప్పరిగూడ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద అకస్మతుగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. బోగీలలోని కొంత బొగ్గు ట్రాక్ పక్కలో పడిపోయింది. గూడ్స్ రైలు బోగీలు పట్టాలు తప్పడంతో మరో ట్రాక్‌పైన వెళ్లే రైళ్లను అధికారులు అపివేశారు. రైల్వే సేఫ్టీ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితులను పరిశీలించి ట్రాక్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. ప్రమాదంపై రైల్వే ఉన్నత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.