Gold Snaching | మియాపూర్, మార్చి 24 : ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒంటరి మహిళ మెడలో ఉన్న బంగారంపై కన్నేశాడు. ఆ బంగారాన్ని కొట్టేయాలని ఫిక్సయిన సదరు వ్యక్తి ఇంటర్నెట్ కనెక్షన్ పేరుతో ఒంటరి మహిళ ఇంట్లోకి వచ్చాడు. ఆ మహిళను కత్తితో బెదిరించి మెడలోని బంగారు గొలుసుని లాక్కొని పారిపోయాడు. ఈ ఘటన మియాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మియాపూర్ ఠాణా పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌లో ఓ ఇంటికి సోమవారం ఇంటర్నెట్ నెట్వర్క్ పరికరాల బిగింపు పేరుతో గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గుర్తించి తనతో తీసుకువచ్చిన పెప్పర్ స్ప్రేను కొట్టి కత్తితో బెదిరించి ఆమె మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసుకుని లాక్కొని పారిపోయాడు.
తేరుకున్న మహిళ గట్టిగా కేకలు వేసినప్పటికీ గుర్తు తెలియని అప్పటికే వీధిలో నుంచి మాయమయ్యాడు. దీనిపై బాధితురాలు మియాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా , పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సంఘటనను మియాపూర్ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.
Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Vijayawada | విజయవాడలో టెర్రర్ కలకలం.. ముగ్గురు యువకులను ఉగ్రవాదంవైపు నెట్టిన హైదరాబాద్ యువతి!
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు