శంషాబాద్ రూరల్, అక్టోబర్ 28 : శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.60లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న సంఘటన శనివారం జరిగింది. కస్టమ్స్ అధికారులు తలిపిన వివరాల ప్రకారం.. కౌలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతడిని పూర్తిస్థాయిలో తనిఖీలు చేశారు.
దీంతో అతడు ఎవరికి అనుమానం రాకుండా ఫేస్ట్ రూపంలో 971 గ్రాముల బంగారం దాచుకొని తరలిస్తుండగా.. స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం రూ.60లక్షల ఉంటుందని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.