Gold | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 7 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. 1.8 కిలోల బరువున్న ఈ బంగారు కడ్డీల విలువ రూ. 2.37 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.