RGIA | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ. 1.55 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సదరు ప్రయాణికుడు ఐరన్ బాక్స్‌లో 1196.20 గ్రాముల బంగారాన్ని దాచి అక్రమంగా తరలించినట్లు అధికారులు నిర్ధారించారు. బంగారం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న సహచరుడిని కూడా నెల్లూరులో పోలీసులు అరెస్టు చేశారు. కస్టమ్స్ యాక్ట్ 1962, సెక్షన్ 110 కింద బంగారాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరిని కూడా విచారిస్తున్నామని చెప్పారు.