Jalamandali | బండ్లగూడ, జూలై 8: నగరంలో నీటి ఎద్దడి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జలమండలి అధికారులకు నగరవాసుల నుంచి నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో బండ్లగూడ లోని కాళికానగర్‌లో చాలా రోజులుగా 3-4 రోజులకొకసారి నీళ్లు వస్తున్నాయి. కాగా తమకు రోజు విడిచి రోజు మంచినీళ్లు ఇవ్వాలని జలమండలి మేనేజర్ శ్రీనివాస్‌ను కాళికానగర్ కాలనీవాసులు నిలదీశారు.